అసలే కరోనా ఎఫెక్ట్ తో అల్లాడుతోంటే పోకిరీల వెకిలి చేష్టలు

అసలే కరోనా ఎఫెక్ట్ తో అల్లాడుతోంటే పోకిరీల వెకిలి చేష్టలు

అసలే కరోనా ఎఫెక్ట్ తో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురవుతుంటే.. కొందరు పోకిరీలు సోషల్ మీడియాలో తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ లో కరోనా వ్యక్తింపు,.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీంతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేసిన.. రాజేష్, రాజు, అనిల్ అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చానల్ లోగోను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని స్థానిక వైద్యాధికారి డాక్టర్ సంయుక్త ఫిర్యాదు మేరకు ముగ్గురుని అదుపులోకి తసుకున్న పోలీసులు.. వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story