ప్రధాని మోదీకి సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ విసిరిన మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీకి సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ విసిరిన మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీకి సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ విసిరారు మంత్రి కేటీఆర్‌.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మొదలైన సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ను ఆయన పూర్తి చేశారు. మొదట ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ విసిరారు.. వెంటనే దాన్ని కేటీఆర్‌ స్వీకరించారు.

సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా.. కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమైందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. చేతులను శానిటైజర్‌తో ఇలా కడుక్కోవాలని కేటీఆర్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తరువాత ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు హర్‌ దీప్‌ పూరి, పీయూష్‌ గోయల్, ఏపీ సీఎం జగన్‌, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మార్క్‌ బెనిఆఫ్‌ లను సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story