స్వీయ నిర్బంధంలో మణిరత్నం, సుహాసిని దంపతుల కుమారుడు

స్వీయ నిర్బంధంలో మణిరత్నం, సుహాసిని దంపతుల కుమారుడు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని దంపతుల కుమారుడు నందన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా వ్యాధికి గురైనవారంతా దాదాపు ఇతర దేశాల నుంచి వారే. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇటీవల సినిమా షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లొచ్చిన నటుడు ప్రభాస్ కూడా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

సుహాసినీ కొడుకు సైతం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి చెన్నై వచ్చిన అతడిని విమానాశ్రయంలో వైద్యులు పరీక్షించారు. కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నాడని నటి సుహాసిని ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నందన్ మాట్లాడుతూ.. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం చాలా కష్టమైన విషయమే. కానీ మన చుట్టూ ఉన్నవారి సంక్షేమం కోసం అనుసరించాలని సూచించాడు. నటి ఖుష్బూ కూడా నందన్‌ను బాధ్యతాయుత దేశ పౌరుడు అంటూ అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story