అంబులెన్స్‌ సేవలను అపహాస్యం చేస్తున్న ప్రబుద్ధులు

అంబులెన్స్‌ సేవలను అపహాస్యం చేస్తున్న ప్రబుద్ధులు

కొందరు ప్రబుద్ధులు అత్యవసర సేవలు అపహాస్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కొందరు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. అంబులెన్స్‌లోనే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు యత్నిస్తున్నారు. నారాయణపేట జిల్లా మఖ్తల్‌కు చెందిన 8 మంది ప్రయాణికులను ఓ అంబులెన్స్‌లో ఎక్కించుకుని హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. అయితే అంబులెన్స్‌పై అనుమానం వచ్చిన జడ్చర్ల పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఎలాంటి రోగులు కూడా కనబడలేదు. ఎనిమింది మంది యువకులు అందులో ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రయాణికులను దించి అంబులెన్స్‌ను సీజ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story