రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ : ప్రధాని నరేంద్ర మోదీ

రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ : ప్రధాని నరేంద్ర మోదీ

ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశానికీ ఇది పరీక్ష సమయం అని వ్యాఖ్యానించిన మోదీ.. జనతా కర్ఫ్యూను ప్రజలు అందరూ పాటించారని కోరారు. మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో పరిణామాలు మనం చూస్తున్నాం, కరోనా నివారణకు సామాజిక దూరం మాత్రమే మన ముందు ఉన్న మార్గమని.. ఇంతకుమించి దారిలేదన్నారు. సామాజిక దూరం ప్రధాని తో సహా ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. సమిష్టిగా కృషి చేస్తేనే ఈ మహమ్మారిని ఎదుర్కొంటామని చెప్పిన మోదీ.. ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో భాగంగా తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story