ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు
ఆంధ్రప్రదేశ్‌ను కరోన రక్కసి భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. ఇటీవల లండన్ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి తిరుపతి స్విమ్స్‌లో చేసిన పరీక్షల్లో వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 251 నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, 229 కేసుల్లో కరోనా లేదని తేలింది. మరో 14 కేసుల విషయంలో నివేదికలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
కరోనా కట్టడి కోసం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై ప్రధానంగా దృష్టిపెడుతోంది ఏపీ ప్రభుత్వం. విశాఖలో ఇప్పటికే 1470 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కేంద్రం పంపిన జాబితాలో ఆ సంఖ్య 2, 400గా ఉంది. దీంతో మిగతా వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి హైరిస్క్‌జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. సీతమ్మధారలో 470 మంది, గాజువాకలో 500 మంది వరకూ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీ ప్రయాణికులకు ఒక అధికారిని కేటాయించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com