అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు

అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో ఎక్కువైంది. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 50 వేలకు చేరువైంది. ఇప్పటికే అమెరికాలో మృతుల సంఖ్య కూడా 600 దాటింది. పరిస్థితి సీరియస్‌గా మారడంతో అమెరికా ఇప్పటికే కరోనా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో పడింది. అమెరికాకు చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్నాయి. గతవారంలో యూఎస్‌ఏలో ఎంఆర్‌ఎన్‌ఏ 1273 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చేశారు.

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సమాచారం మేరకు సుమారు 20 రకాల కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల తయారీ పురోగతిలో ఉన్నాయి. అమెరికాలోనూ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఫెడల్పియా ఆఫ్‌ హెల్త్‌ కొలాబిరేషన్‌ ఫౌండర్‌ కమల కల్యాణి మద్దాలి కోరారు. ప్రస్తుతానికి కరోనాకు మందు ఇంకా దొరకలేదని.. వ్యాక్సన్‌ కనుకునేందుకు అమెరికాలో ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.. ఇప్పటికే గ్లోబల్‌ కరోనా వైరస్‌ టాస్కఫోర్స్ కరోనా వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు పాటించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రజంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమ మార్గమని సూచించారు.. భారత దేశంలో ప్రధాని మోదీ ప్రకటించిన భారత్‌ లాక్‌డౌన్‌ మంచి ఫలితం ఇస్తుంది అన్నారు. మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story