తమిళనాడులో తొలి కరోనా మరణం

తమిళనాడులో తొలి కరోనా మరణం

భారత్‌లో‌ కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదైంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సీ విజయ్‌భాస్కర్‌ తెలిపారు. ఆ వ్యక్తి రక్తపోటుతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నమరో ముగ్గురిని గుర్తించి వారిని ఐసోలేషన్‌లో ఉంచారు దీంతో తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. మరోవైపు భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 566 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కేరళలో మొదలైన ఈ వైరస్ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమిస్తోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలకు కరోనా వ్యాపించింది. కేరళ, మహారాష్ట్రల్లో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ గా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా ఎఫెక్ట్ మొదలైంది. మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 566కు చేరాయి. వైరస్ సోకి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story