ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా లాక్ డౌన్

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువులు, అత్యవసర పనులమీద వెళ్లే వారి వాహనదారులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి... అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నవారిపై కేసులు నమోదుచేయడంతో.... ధరలు దిగివచ్చాయి. ఇక సూర్యాపేట, కోదాడ శివారులోని తెలంగాణ- ఆంధ్ర సరిహద్దుల్లో చెక్ పోస్టును ఏర్పాటుచేశారు. వాహనాలకు అనుమతి లేదని బోర్డుపెట్టారు. మిర్యాలగూడ వాడపల్లి వద్ద ఏపి-తెలంగాణ సరిహద్దుల్లోకూడా వాహనాలను కట్టడిచేశారు. హైదరాబాద్ -విజయవాడ హైవే చౌటుప్పల్ వద్ద పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహాడ్ ప్లాజాను మూసివేశారు. అంబులెన్స్, అత్యవసర సర్వీసుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

Tags

Next Story