ఆంధ్ర- తెలంగాణ చెక్‌పోస్ట్‌ వద్ద అలజడి

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సమీపంలోని తాటియాకుల గూడెం వద్ద ఆంధ్ర- తెలంగాణ చెక్‌పోస్ట్‌ వద్ద ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కరోనా వైరస్‌ను నిరోధించే చర్యలలో భాగంగా రెండు రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడంతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తాము 21 రోజుల పాటు ఇళ్లు, వాకిలి, కుటుంబాలను వదిలి రహదారిపై అనధలా గడపాలంటూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అందరూ కలసి చెక్‌పోస్ట్‌ సిబ్బందిని బలవంతంగా పక్కకు తోసివేసి తమ వాహనాలతో వెళ్లిపోయారు. లారీలను నియంత్రింకలేక చెక్‌పోస్ట్‌ సిబ్బంది చేతులెత్తేయడంతో రెండు రోజులుగా రహదారిపై నిలిచి వాహనాలు గంటల వ్యవవధిలోనే సరిహద్దు దాటి వెళ్లిపోయాయి.

Tags

Next Story