కరోనాతో కాశ్మీర్ వ్యక్తి మృతి.. 14కు చేరిన మరణాలు

కరోనాతో కాశ్మీర్ వ్యక్తి మృతి.. 14కు చేరిన మరణాలు

భారత దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. తాజాగా ఇండియాలో మరో కరోనా మరణం సంభవించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 14కి చేరింది. కశ్మీర్‌లో 65 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. వృద్ధుడి కుటుంబంలోని మరో నలుగురికి కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వారిని ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. మార్చి 25న బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story