పవన్ కళ్యాణ్ దాతృత్వం.. ఏపీ, తెలంగాణకు భారీ విరాళం
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా బాధితులకు తన వంతు సాయంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో రూ.50 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు పవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ లకు ఈ డబ్బును త్వరలోనే ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దక్షిణ భారత చలన చిత్ర కార్మికుల సంక్షేమం కోసం రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య తమ వంతుగా ఆర్ధిక సాయం ప్రకటించారు. వీళ్ల బాటలోనే చాల మంది సినీ నటులు తమ వంతు సామాజిక బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com