'రామాయణం' మళ్లీ వస్తోంది

రామాయణం మళ్లీ వస్తోంది

రామయ్య తండ్రీ కరోనాను కంట్రోల్ చేయలేవా. జనాలు చచ్చిపోతున్నారు. నీతో ఎంత మొర పెట్టుకున్నా లాభం లేనట్టుంది. అయినా నువ్వు మాత్రం ఏం చేయగలవులే. ఇదంతా మేం చేసుకున్న ప్రారబ్ధమే. సర్లేగాని స్వామీ అప్పుడెప్పుడో నిన్ను కళ్లారా చూసుకునే భాగ్యాన్ని దూరదర్శన్‌లో కల్పించావు. మళ్లీ ఒకసారి మాకు కనిపించకూడదు అని ప్రజలంతా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. రామాయణం సీరియల్‌లో నటించిన హీరోలో రాముడిని, హీరోయిన్‌లో సీతని చూసుకున్నారు. వాళ్లు బయట కనిపిస్తే ఆ రాముడే దిగి వచ్చాడా అన్నంతగా తన్మయత్వానికి గురయ్యేవారు.రాముడితో పాటు సర్కారు సార్లూ విన్నట్టున్నారు. ప్రజల కోరిక మేరకు రేపట్నించి అంటే మార్చి 28 శనివారం నుంచి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్నారు. ఈ విషయాన్నికేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ విధంగా కూడా జనం రోడ్ల మీదకు రాకుండా ఓ గంటపాటు కంట్రోల్ చేయొచ్చని ఆలోచించినట్టుంది. అందుకే వెంటనే ఓకే చెప్పేసింది. మరి 'రామాయణం' కి ఉన్న క్రేజ్ అలాంటిది.

Tags

Read MoreRead Less
Next Story