మాస్క్‌లను రూ.8కే అమ్మాలి : కేంద్రం

మాస్క్‌లను రూ.8కే అమ్మాలి : కేంద్రం

దేశంలో కరోనా మహామ్మరి రోజు రోజుకి వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు ఆకాశాన్నంటాయి. కరోనా వైరస్ కట్టడికి అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు అందరూ నోటికి మాస్కులు ధరిస్తున్నారు. ప్రజలు విరివిగా మాస్కులు, శానిటైజర్ కొనుగోలు చేస్తుండటంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో రిటైల్ దుకాణాలతో పాటు ఆన్ లైన్ సంస్థలు కూడా వీటి రేట్లను విపరీతంగా పెంచుతున్నారు. దీంతో మాస్క్, శానిటైజర్ల ధరల్లో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాస్క్‌ల ధరల్లో గందరగోళాన్ని కేంద్రం తొలిగించింది. 3 ప్లే (మూ డు పొరలు ఉన్న) మెల్ట్‌బ్లౌన్‌ మా స్క్‌లను రూ.16కు అమ్మాలని వ్యా పారులకు సూచించింది. ప్రస్తుతం మా స్క్‌లకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో 2 ప్లే (రెండు పొరలు), 3 ప్లే సర్జికల్‌ మాస్క్‌లను రూ.8, రూ.10 చొప్పున అమ్మాలని కేంద్రం ఆదేశించింది. 3 ప్లే మెల్ట్‌బ్లౌన్‌ మాస్క్‌లను ఫిబ్రవరి 12 నాటి ధరకే అమ్మాలని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story