కరోనా కలిపింది ఇద్దరినీ..

X
విడాకులు తీసుకున్నారు.. ఎవరి జీవితాలు వాళ్లవి.. మరి పిల్లలు.. నాన్న దగ్గర కొన్ని రోజులు, అమ్మ దగ్గర కొన్ని రోజులు. ఇలా ఒకటీ రెండూ కాదు. ఆరేళ్లుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు కరోనా వచ్చి విడాకులు తీసుకున్న భార్యాభర్తలు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానేను ఒక దగ్గరకు చేర్చింది. 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని రోజులు పిల్లలను చూడకుండా ఎలా ఉండాలని మూటా ముల్లె సర్ధుకుని హృతిక్ దగ్గరకు వచ్చేసింది సుజానే. పిల్లల పేరుతో అయినా సుజానే తన ఇంటికి వచ్చిందని హృతిక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇక పిల్లల గురించి అయితే చెప్పే పనిలేదు. ఇన్ని రోజులు అమ్మ ఒక దగ్గర నాన్న ఒకదగ్గర. ఇప్పుడు అమ్మానాన్న ఒకే చోట. పైకి చెప్పలేకపోయినా ఆ చిన్నారుల మనసులో ఆనందం వెల్లివిరుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
