ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

తెలంగాణ నుంచి ఎన్‌.ఓ.సి.లతో ఏపీకి వచ్చిన వారిని ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏపీ ప్రభుత్వంపై పలువురు దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలో ఏపీకి రావడానికి ప్రజల్ని అనుమతించాలని ఏపీ హైకోర్టులో బీజేపీ నేత వెలగపూడి గోపాల్ కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రజల్ని అనుమతించాలని ప్రభుత్వానికి సూచింది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ లేఖను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

అందులో 'తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్‌.ఓ.సి.లతో ఆంధ్ర ప్రదేశ్‌ కు వచ్చేవారిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం హైదరాబాద్‌ నగరంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువతకు ఊరట కలిగిస్తుంది. వారి ఆందిళనను అర్ధం చేసుకున్న హైళీర్టుకు ధన్యనాదాలు, అనుమతించడంపై హైకర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలి. అవసరమైన వారిని క్యారంటైన్‌, లేనివారిని హోమ్‌ క్వారంటైన్‌ చేయాలనే ఆ ఆదేశాలను ఏపీకి వస్తున్నవారు బాధ్యతతో గౌరవించాలి. హైదరాబాద్‌ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, యువత, అక్కడ చిక్కుకుపోయినవారి బాధకు స్పందించి పిటీషన్‌ దాఖలు చేసిన బీజేపీ నేత వెలగపూడి గోపాల్ కృష్ణ గారికి అభినందనలు' అంటూ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story