అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును పరీశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

లాక్ డౌన్ నేపధ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ- ఆంధ్ర బార్డర్ కు మంత్రి చేరుకొని, పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దును మూసివేసి, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులను అడ్డుకోవడంతో.. మంత్రి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు, కలెక్టర్, ఎస్పీతో కలిసి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి చొరవతో అధికారులు షరతులతోకూడిన అనుమతి ఇచ్చారు. స్క్రీనింగ్ పరీక్ష చేసిన తర్వాత వారిని ఏపిలోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని, ఇకమీదట ఎవరు ప్రయాణాలు చేయవద్దని మంత్రి ఈ సందర్బంగా సూచించారు. ఇకనుంచి సరిహద్దుల వద్ద పూర్తిస్థాయిలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com