లాక్‌డౌన్‌కు విరుద్ధంగా రోడ్డు మీదకు వస్తే కొరడా ఝళిపిస్తున్న పోలీసులు

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చేవారికి.. పోలీసులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. కరీంనగ్ జిల్లా ధర్మపురిలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోకిరీలను గుంజీలు తీయించారు ఎస్సై శ్రీకాంత్. లాఠీలతో కొట్టకుండా పాతకాలపు శిక్షలు అమలు చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో ఆకతాయిలపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. మరోవైపు నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారికి పుష్పగుచ్చాలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు స్థానిక నాయకులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లు.. వాహనదారులకు పలు సూచనలు చేశారు.
ఇక కడప జిల్లాలో జమ్మలమడుగులో రోడ్లపైకి వచ్చినవారిని గుంజీలు తీయిస్తున్నారు పోలీసులు. కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com