పంజాబ్ లో మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు

పంజాబ్ లో మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు

భారత్ లో కరోనా వైరస్ అలజడి రేకెత్తిస్తూనే ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 700 కు పైగా చేరుకుంది. పంజాబ్ రాష్ట్రంలో మొదట్లో నెమ్మదిగా నమోదైన కేసులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కేరళలో తాజాగా మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో పంజాబ్‌లో కరోనావైరస్ కేసులు మొత్తం 38 కి చేరుకున్నాయి. ఇదిలావుంటే దేశంలో 640 క్రియాశీల కరోనావైరస్ రోగులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య స్పష్టం చేసింది.

అయితే ఇందులో మొత్తం 67 మందికి నయం అయిందని కానీ వారిలో కొంతమంది మాత్రమే డిశ్చార్జ్ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 19 తాజా కేసులతో, కేరళలో మొత్తం COVID-19 రోగుల సంఖ్య 137 కు పెరిగిందని వెల్లడించింది. ఇక ఇప్పటివరకు 130 క్రియాశీల కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story