ఈఎంఐలు మూడు నెలలు కట్టక్కర్లేదు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

కరోనా మహమ్మరి ప్రజలను గడగడలాస్తుంది. అయితే ఈ కరోనా కట్టడికి కేంద్ర సర్కార్ లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించాల్సిన ప్రజలకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలల పాటు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అంటూ ర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం కీలక ప్రకటన చేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని ప్రకటించిన శక్తికాంత దాస్.. మార్కెట్లోకి రూ.3.75 లక్షల కోట్లను పంపింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి ఆర్బీఐ అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోందని శక్తికాంత దాస్ వెల్లడించారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని, ఇలాగే ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోకు నగదు పంపింగ్, ఈఎంఐలపై భారీ ఊరట కల్పించారు. అన్నిరకాల టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం ఉంటుందని వెల్లడించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com