ఆర్థిక మందగమనం అధిగమించడానికి కీలక చర్యలు తీసుకున్న ఆర్బీఐ

ఆర్థిక మందగమనం అధిగమించడానికి కీలక చర్యలు తీసుకున్న ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశ ప్రజలకు తీపికబురు అందించింది. రుణ గ్రహీతలు, ఈఎమ్‌ఐ చెల్లింపుదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. 3 నెలల పాటు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రకాల టర్మ్ లోన్లపై 3 నెలల పాటు మారటోరియం విధించింది. సహకార రుణాలపైనా మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. మారటోరియం కోసం ఆర్బీఐ అనుమతించిన బ్యాంకుల జాబితాలో వాణిజ్య బ్యాంకులు, రుణ సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయి.

కరోనా విస్తరిస్తున్న వేళ ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిగింది. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మందగమనాన్ని అధిగమించడానికి 4 చర్యలు ప్రకటించారు. మార్కెట్లలో లిక్కిడిటీ స్థిరత్వం, బ్యాంకుల రుణాల ప్రక్రియలో నిలకడ, చెల్లింపుల్లో సడలింపు చర్యలు, మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించారు. రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు కుదించారు. ఈ నిర్ణయంతో రెపో రేటు 4.40 శాతానికి, రివర్స్ రెపో రేటు 4 శాతానికి తగ్గింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తి-CRRను 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో CRR 3 శాతానికి చేరుకుంది. అలాగే, మార్కెట్‌లో నగదు నిల్వల స్థిరత్వంపై ఆర్బీఐ దృష్టి సారించింది. మార్కట్‌లోకి 3 లక్షల 74 వేల కోట్లు పంపిణీ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ పటి ష్టంగా ఉందని, బ్యాంకుల్లో డబ్బులు భద్రంగా ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. వినియోగదారులకు తమ డిపాజిట్లు, నగదుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఆర్బీఐ ప్రకటన రుణాల చెల్లింపుదారులకు భారీ ఊరటే. వచ్చే మూడు నెలల పాటు ఈఎమ్‌ఐలు కట్టాల్సిన అవసరం లేదు. ఆ మూడు నెలల్లో కట్టాల్సిన వాయిదాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లిం చవచ్చు. అలాగే, ఈఎమ్‌ఐల చెల్లింపుల్లో జాప్యం కారణంగా సిబిల్ స్కోర్‌పై కూడా ఎఫెక్ట్ కాదు. అంటే ఈ 3 నెలల పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే సిబిల్ స్కోరు తగ్గదు. ఈఎమ్‌ఐల వాయిదా వే సుకునే అవకాశం గృహ, వాహన, వ్యక్తిగత, కన్సూమర్‌ రుణాలకు వర్తిస్తుంది. సహకార లోన్లకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

బిజినెస్‌ పీపుల్‌కు కూడా ఆర్బీఐ రిలీఫ్ ఇచ్చింది. వర్కింగ్ కేపిటల్ లోన్లపై వడ్డీని 3 నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకులకు సూచించింది. ఈ నిర్ణయంతో వ్యాపారులపై వడ్డీ భారం కాస్త తగ్గుతుం ది. ఇప్పటికిప్పుడు రుణాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే జరిగిన నష్టం నుంచి కొద్దిగా తేరుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మూలధన సమీకరణ కోసం ఇబ్బంది పడుతున్న బ్యాంకుల ను ఎన్‌పీఏలుగా ప్రకటించమని ఆయన చెప్పారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా భయం నెలకొంది. మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. వర్తక, వాణిజ్యాలు, విద్యాసంస్థలు, హోటళ్లు, మాల్స్ అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఉద్యోగాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉపాధి తగ్గిపోయి జీతాలు అందే పరిస్థితి లేదు. దాంతో బ్యాంక్ లోన్లు, ఈ ఎమ్‌ఐలు కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కొద్దిగా వెసులుబాటు కల్పించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక సుస్థిరత, ద్రవ్యోల్బణం అదుపు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం... ఇవే ఆర్బీఐ ముందున్న లక్ష్యాలు. కరోనా ప్రభావం మరింత పెరిగితే వృద్ధి రేటు దెబ్బతింటుందని ఆర్బీఐ తెలి పింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత దిగజారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, లాక్‌డౌన్ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి కేంద్రం భారీ రిలీఫ్ ప్యా కేజీ ప్రకటించింది. లక్ష 70 వేల కోట్ల రూపాయలతో ఆర్థిక సాయం అందించింది. ఈ ప్రకటన మర్నాడే ఆర్బీఐ రిలీఫ్ చర్యలు ప్రకటించడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story