మాధవీ లత గారు నోరుంది కదా అని అలా కామెంట్లు..

మాధవీ లత గారు నోరుంది కదా అని అలా కామెంట్లు..

ఎవరినైనా అనడం ఎంత ఈజీ.. అదే ఆచరణ ఎంతో కష్టం. ఇంట్లో కూర్చుని కాలు కదపకుండా టీవీ చూస్తూ ఎన్ని కామెంట్లైనా చేయొచ్చు. అయ్యో వాళ్లకీ ఫ్యామిలీ ఉంటుంది.. అయినా పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ప్రాణాలకి వాళ్ల ప్రాణాలు అడ్డేసి కాపాడుతున్నారన్న విచక్షణ లేకుండా పైగా కామెంట్లు చేస్తారా అని బీజేపీ యువ నాయకురాలు మాధవీలతపై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వీధికో పోలీస్ డ్యూటీ చేసేలా ఆజ్ఞలు జారీ చేసింది. పాపం వాళ్లకీ భార్య, బిడ్డలు ఉంటారు. అయినా డ్యూటీ చేస్తున్నారు. మరి బయటకు రావద్దు బాబు అని నెత్తీ నోరు మొత్తుకున్నా కానీ వస్తుంటే లాఠీ ఝుళిపించమన్న సర్కారు ఆదేశాల్ని అక్షరాలా పాటిస్తుంటే మాధవీ లత గారు బ్లడీ స్టుపిడ్ పోలీస్ అని కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది అని నెటిజన్స్ ఆమెను ఏకి పారేస్తున్నారు. ఒక్క రోజు మీరు డ్యూటీ చేయండి తెలుస్తుంది అని అంటున్నారు. నిజమే కదా నీళ్లల్లో దిగిన వాడికే లోతు తెలుస్తుంది. ఒడ్డున కూర్చున్న వాడు ఎన్ని కబుర్లైనా చెబుతాడు అని ఆమెను కామెంట్ చేసిన వారిని సపోర్ట్ చేస్తున్నారు మరి కొంతమంది. అసలే ఓ పక్క ఎండ, మరో పక్క కరోనా భయం, మళ్లీ మాట పెడచెవిన పెడుతున్న జనం.. తిక్క రేగితే లాఠీ ముక్కలవదూ.. మాధవీ లతను సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. అవును మేడమ్.. పోలీసులు మంచిగా చెప్పాలి కానీ అలా గొడ్డును బాదినట్టు చావబాదితే ఎలా అని కొందరు అంటున్నారు. అయినా ఊరికే వస్తారా ఏవిటి. వాళ్లక్కూడా ఏదైనా అత్యవసరమైతేనే కదా అని అంటున్నారు. ఏది ఏమైనా కర్ఫ్యూ రోజు సాయింత్రం తమ సేవలు అందిస్తున్న పోలీసులకు, డాక్టర్లకు ఇంకా ఇతర సిబ్బందికి చప్పట్లతో మనం వారిని గౌరవించుకున్నాం. ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయి ఇలా కామెంట్ చేయడం తగని పని.

Tags

Read MoreRead Less
Next Story