మందు బాబులకు బ్యాడ్ న్యూస్

మందు బాబులకు బ్యాడ్ న్యూస్

మందు బాబులకు మధ్యప్రదేశ్ సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మన దేశంలో కూడా కరోనా విజృభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రధాని మోదీ.. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర సేవలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లగలుగుతారని మోదీ స్పష్టం చేశారు. అలాగే రేషన్, పాలు, మందులు, కూరగాయలు లాంటి వాటిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చారు. మద్యంను ఇందులో చేర్చలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ లో కూడా మద్యం షాపులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచారు. అయితే 21 రోజుల లాక్ డౌన్ సందర్బంగా శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లో మద్యం షాపులు మూసివేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. తాజాగా కేరళ ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలను నిలిపివేసింది. అయితే కేరళలో మద్యం అందకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story