కరోనాను జయించిన 101 ఏళ్ల వయోవృద్ధుడు

ఇటలీలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో 8 వేల మందికి పైగా మరణించారు. 80 వేల మందికి పైగా వ్యాధి భారిన పడ్డారు. అయితే కరోనా వైరస్‌ ధాటికి కుప్పకూలిన ఇటలీలో అద్భుతం చోటుచేసు​కుంది. వైరస్ బారిన పడిన 101 ఏళ్ల వయోవృద్ధుడు కోలుకున్నాడు దీంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

"మిస్టర్ పి" అని పిలువబడే ఈ వ్యక్తి ఈ వ్యాధి నుండి కోలుకున్న అతి పురాతన వ్యక్తి అని ఇటాలియన్ వార్తా నివేదికలు తెలిపాయి. రిమిని డిప్యూటీ మేయర్ గ్లోరియా లిసి తెలిపిన వివరాల ప్రకారం, 1919 లో జన్మించిన మిస్టర్ పి, రివిని ఆసుపత్రిలో చేరారు.. ఒక వారం క్రితం COVID-19 కు పాజిటివ్ పరీక్షించిన తరువాత అతన్ని చేర్చుకుంది.

కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడినప్పటికీ కోలుకున్నారని గ్లోరియా లిసి తెలిపారు. అంతేకాదు ఆస్పత్రి నుంచి బుధవారం ఆయనను డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. దీంతో 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కోలుకోవడంతో వైరస్ భారిన పడిన రోగులకు ఆత్మవిశ్వాసం పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story