కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన పెంచడానికి కరోనా హెల్మెట్ ధరించిన చెన్నై కాప్
కరోనావైరస్ మహమ్మారి యొక్క తీవ్రత గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో, చెన్నైలోని ఒక పోలీసు అధికారి సహకారంతో స్థానిక కళాకారుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో ప్రయాణికులను వీధుల్లోకి రాకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేకమైన 'కరోనా హెల్మెట్' తయారు చేశారు.
హెల్మెట్ రూపకల్పన చేసిన ఆర్టిస్ట్ గౌతమ్, చెన్నైలోని ANI తో మాట్లాడుతూ.. "కోవిడ్ -19 పరిస్థితిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని.. మరోవైపు, పోలీసు సిబ్బంది ప్రజలు ఇంటి వద్దే ఉండేలా పనిచేస్తున్నారు.. అయినా ప్రజలు వినకుండా ఇష్టమొచ్చినట్టు బయట తిరుగుతున్నారు.. ఇలా చేస్తే వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఎలా ఉంటుంది అన్నారు.
ఈ క్రమంలో ప్రజలకు "నేను ఈ ఆలోచనతో వచ్చాను.. విరిగిన హెల్మెట్ సహాయంతో కాగితాలను ఉపయోగించి ఈ కరోనా హెల్మెట్ ను తయారు చేశాను.. దీనిపై అనేక ప్లకార్డులను కూడా ఉంచి పోలీసులకు అప్పగించాను" అని ఆయన చెప్పారు.
వీధుల్లో 24/7 డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించడంలో ఈ కరోనా హెల్మెట్ ఉపయోగపడుతుందని నిరూపించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేష్ బాబు ఈ హెల్మెట్ ధరించి మోటారు బైక్ రైడర్లను ఆపి ఇంట్లో ఉండమని కోరుతున్నారు.. లేదంటే ఈ మహమ్మారి మిమ్మల్ని వదలదు అని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com