మా తిండి మా ఇష్టం.. మారని చైనా..

మా తిండి మా ఇష్టం.. మారని చైనా..

అడ్డమైన గడ్డీ తినేస్తే రోగాలు రాక ఏమవుతుంది. పాములు, చీమలు దేన్నీ వదలకపోతే ఎలా.. పైగా మీరొక్కరే తిని చావకుండా ప్రపంచానికి అంతా అంటించేశారు కదరా నాయనా.. ఇంత జరుగుతున్నా కొంచెం కూడా బాధ లేకుండా మళ్లీ నాలుక్కి అవే రుచులు అందిస్తున్నారు. ఇప్పటికీ చైనా మార్కెట్లో గబ్బిలాలు, కుక్కలు, ఉడుములు, నెమళ్లు, జింకలు వంటి జంతువులు, పక్షులు సజీవంగా కనిపిస్తాయి. వీటిని బోనుల్లో బంధించి ఉంచుతారు. కస్టమర్

కావలసినదాన్ని సెలెక్ట్ చేసుకుంటే చంపేసి ముక్కలు కట్ చేసి ఇస్తారు. కరోనా వచ్చిన వూహాన్ మార్కెట్ ఒక్కటే కాదు. వేల సంఖ్యలో చిన్న చిన్న మార్కెట్లు వీధికొకటి కనిపిస్తాయి. కరోనా వచ్చాక ఓ 20 వేల మార్కెట్లయితే మూతపడ్డాయి కానీ.. పరిస్థితి కాస్త సద్దుమణిగితే మళ్లీ యధా మామూలే. గతంలో సివిట్ అనే పిల్లి నుంచి సార్స్ అనే వైరస్ వచ్చిందని కొన్నాళ్లు ఆ మార్కెట్ మూతపడింది. ఇప్పుడు మళ్లీ శుభ్రంగా పిల్లులను అమ్మేసుకుంటున్నారు. ప్రపంచం అంతా ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కు మంటూ నాలుగ్గోడల మధ్య బతికేస్తుంటే.. చైనాలో మాత్రం ఆన్‌లైన్లో వన్యప్రాణుల విక్రయాలు మూడు గబ్బిలాలు, ఆరు ఉడుములుగా సాగుతోందని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అలుగు అనే వన్య ప్రాణి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా అలుగులను విక్రయించే మార్కెట్ చైనాలోనే ఉంది మరి. ఇంత జరుగుతుంటే వాటిపై నిషేధం విధించి కట్టడి చేయొచ్చుగా అని అనేవాళ్లు లేకపోలేదు. వచ్చిన చిక్కంతా అక్కడే. చైనీయులు సంప్రదాయా వైద్యానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. మరి ఆ వైద్యంలో వాడేదంతా జంతువులు, పక్షులకు సంబంధించిన అవయవాలే. దాంతో ఎవరూ ఏమీ

చేయలేని పరిస్థితి. ఆఖరికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ సైతం. సంప్రదాయ వైద్యశాస్త్రం చైనాకు ఖజానా వంటిదని అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వైద్యంలో భాగంగానే జంతువుల పచ్చిమాంసం తినడం, వాటి స్రావాలను వాడడం వంటివి చేస్తుంటారు. కోవిడ్ వచ్చినా, కోటి మంది బలైపోయినా చైనాను ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story