ఎవరో సైకోలు, శాడిస్టులు పెట్టే వార్తలను నమ్మవద్దు: ఈటెల రాజేందర్

ఎవరో సైకోలు, శాడిస్టులు పెట్టే వార్తలను నమ్మవద్దు: ఈటెల రాజేందర్

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో సర్కారు మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్‌ చేసేందుకు వీలుగా ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అటు సోషల్‌ మీడియాలో కరోనా గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఈటెల మండిపడ్డారు. ఎవరో సైకోలు, శాడిస్టులు పెట్టే వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తామని ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు

Tags

Read MoreRead Less
Next Story