వలస కూలీలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు 1000 ప్రత్యేక బస్సులు

వలస కూలీలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు 1000 ప్రత్యేక బస్సులు

ఇండియాలో కరోనా మహమ్మరి విజృభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం .. దేశమంతా లాక్ డౌన్ విధించి ఎక్కడిక్కడ దేశాన్ని అష్టదిగ్బంధనం చేసింది. కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నాయి. దీంతో జన సాంద్రత ఎక్కడిక్కడే స్తంభించి పోయింది. అలాగే బతుకు దెరువు కోసం పట్టణాలకు వచ్చిన రోజువారి కూలీలు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలకు బతకడం కష్టంగా మారింది. ఢిల్లీలో ఉంటున్న రోజువారి కూలీల పరిస్థితి కూడా ఇలాంటిందే.

ఇక పట్టణాల్లో జీవనం కొనసాగించలేమని భావించిన వారు.. ఉత్తరప్రదేశ్‌లోని తమ గ్రామాలకు పయనమవుతున్నారు. అయితే కూలీలు తిరిగి తమ సొంతూళ్లకు వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. సొంత గ్రామాలకు వారు కాలినడకన బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. వలస కూలీల రవాణా కోసం 1000 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో కూలీలను స్వస్థలాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఢిల్లీ , యూపీ సరిహద్దులోని ఘజియాపూర్‌కు వందల సంఖ్యలో కూలీలు చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడే అడ్డుకుని ప్రత్యేక బస్సుల్లో పంపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story