ట్రైన్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తున్న రైల్వే శాఖ

ట్రైన్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తున్న రైల్వే శాఖ

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఇక ఇండియాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను నివారించడానికి మోదీ సర్కార్ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు అన్ని రకాల ప్రయాణ రైళ్ల సేవలు నిలిచిపోయాయి. అయితే రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సైతం.. రైల్వే కోచ్‌లను, క్యాబిన్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేకుందు సిద్ధం అయింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా ఉపయోగించడంపై యోచించాల్సిందిగా మోదీ సూచించారు. ప్రధాని సూచన మేరకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో భాగంగా నార్తరన్‌ రైల్వే కోవిడ్‌-19 పేషెంట్ల కోసం తన మొదటి ఫోటోటైప్‌ ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసింది. నాన్‌ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా రూపోందిస్తుంది. పేషెంట్‌ క్యాబిన్‌ రూపకల్పనకు కోచ్‌లో ఒక వైపు ఉన్న మూడు బెర్త్‌ల్లో మిడిల్‌ బెర్త్‌ను తీసేశారు. మరో వైపు ఉన్న మూడు బెర్త్‌లను పూర్తిగా తొలగించారు. పై బెర్త్‌ ఎక్కేందుకు ఉన్న నిచ్చెన వంటి సదుపాయాలను తొలగించారు. బాత్‌రూంలను, ట్యాప్‌లను మార్పు చేశారు. ప్రతీ క్యాబిన్‌కు ప్రత్యేక కర్టెన్లు ఏర్పాటు చేశారు. వైద్య పరికరాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించారు. ఒక్కో కోచ్‌లో 10 వార్డులు ఉండేటా ఏర్పాట్లు చేశారు. ఐసోలేషన్‌లో ఉండేవారి వస్తువుల కోసం అల్మరాలను ఏర్పాటుచేశారు. అలాగే రోజూ ఈ కోచ్‌లను శుభ్రం చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

Tags

Next Story