కరోనా కొన్ని రోజులే.. మన స్నేహం జీవితాంతం..

కరోనా కొన్ని రోజులే.. మన స్నేహం జీవితాంతం..

కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్‌డౌన్‌తో బిజీ లైఫ్‌కి బ్రేక్ పడింది. ఎవరి జీవితాలు వాళ్లవి పలకరించడానికి కూడా టైమ్ లేనంత బిజీ షెడ్యూల్. అలాంటిది ఇప్పుడు బోలెడంత ఖాళీ. చూసిన సినిమానే చూసినా, ఎంత సేపు ఫోన్ మాట్లాడినా టైమ్ గడవట్లేదు. ఈ సమయంలో మెగాస్టార్, కలెక్షన్ కింగ్‌ల మధ్య ట్విట్టర్ వేదికగా సరదా సంభాషణ సాగింది. చిరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భంగా మోహన్ బాబు మిత్రమా స్వాగతం అని ట్వీట్ చేస్తే.. దానికి చిరు రిప్లై ఇస్తూ రాననుకున్నావా.. రాలేననుకున్నావా అని సరదాగా సంభాషించారు.

మోహన్ బాబు వెంటనే ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందామని అన్నారు. మిత్రమా కరోనా ఉన్న సమయంలో హగ్‌ల గురించి ప్రస్తావిస్తావెందుకు.. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్.. ఓన్లీ నమస్తే.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి మన మంచు లక్ష్మి చేసింది చూడు అని చిరు ట్వీట్ చేసారు. మోహన్ బాబు సమాధానమిస్తూ కరోనా కొన్ని రోజులే.. మన స్నేహం జీవితాంతం.. అని చిరంజీవికి రిప్లై ఇచ్చారు. వీరి ఆసక్తికర సంభాషణ ఫ్యాన్స్‌ని అలరించింది. మొత్తానికి కరోనా హాలిడేస్‌ని మన స్టార్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు వీరి ట్వీట్లు చూసి.

Tags

Read MoreRead Less
Next Story