జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షం కారణంగా పలు కొండచరియలు విరిగిపడ్డాయి.. దాంతో కాశ్మీర్‌కు అవసరమైన వస్తువులను తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు శనివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చిక్కుకున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాంబన్ జిల్లాలో భారీగా లారీలు నిలిచిపోయాయి. 270 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి.. కాశ్మీర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రహదారి, ఇది కాస్త వర్షం కారణంగా లాక్ అయిపోవడంతో తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం సంభవించగా, దిగువ కొండలు మరియు మైదానాలు శుక్రవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొట్టుకుపోయాయి, దీని ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చందర్‌కోట్ మరియు బనిహాల్ (రాంబన్ జిల్లా) మధ్య డజనుకు పైగా ప్రదేశాలలో కొండచరియల విరిగిపడటం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం హైవే దిగ్బంధమైందని అని ట్రాఫిక్ (జాతీయ రహదారి) డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ ఆనంద్ పిటిఐకి తెలిపారు. ఈరోజు వాతావరణం కాస్త మెరుగుపడటంతో రహదారిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com