ప్రముఖ కళాకారుడు కన్నుమూత..

ప్రముఖ కళాకారుడు కన్నుమూత..

ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్‌, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత సతీష్‌ గుజ్రాల్‌ మరణించారు. ఆయన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సొంత తమ్ముడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చికిత్స పొందుతూ గురువారం మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టు ముఖభాగాన్ని అలంకరించే వర్ణమాల కుడ్యచిత్రాన్ని వేయడం దగ్గరనుంచి జాతీయ రాజధానిలోని బెల్జియన్ రాయబార కార్యాలయాన్ని రూపొందించడం వరకు ఆయన సేవలు ఉన్నాయి.

లాహోర్ కళాశాల విద్యార్థి అయిన తన అన్నయ్య ఐకే గుజ్రాల్‌తో కలిసి కవిత్వ పతనం చేసేవారని చెబుతుంటారు. గుజ్రాల్‌ మరణంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.. గుజ్రాల్‌ మృతికి సంతాపం తెలిపారు. ఇక నటుడు, ఆర్కిటెక్ట్‌ గుజ్రాల్‌ మరణం దేశానికి తీరని లోటని, ఆయన సేవలను దేశం ఎన్నడూ గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Next Story