మీకోసం మేం ఉన్నాం.. సురేష్ ప్రొడక్షన్స్ భారీ సాయం..

మీకోసం మేం ఉన్నాం.. సురేష్ ప్రొడక్షన్స్ భారీ సాయం..

ఓ సినిమా బయటకు రావాలంటే ఎంతో మంది కష్టం. అందులో రోజువారీ వేతనానికి పని చేసే వారు కూడా ఉంటారు. షూటింగ్ లేకపోతే దినసరి కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. పనిలేకపోతే డబ్బులు రావు. పస్తులు పడుకోవలసి వుంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. దాంతో రోజువారి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క హెల్త్ వర్కర్లు వ్యాధి బారిన పడిన వారికి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెండు వర్గాలను ఆదుకునేందుకు సురేష్ ప్రొడక్షన్ తమ వంతు సాయంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఇప్పటికే సిని పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భారీ విరాళాలను ప్రకటించి తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story