నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన విశాఖ చెస్ట్ హాస్పిటల్

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన విశాఖ చెస్ట్ హాస్పిటల్

విశాఖ చెస్ట్‌ ఆస్పత్రి నిలువెత్తు నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కరోనా లక్షణాలున్న వారిని వైద్యం కోసం చెస్ట్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అక్కడికెళ్లిన అందరికి మెరుగైన వైద్యం అందుతుందని భావిస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. అందుబాటులో వైద్యులు లేరు. కనీసం వార్డు బాయ్‌లు కూడా కనబడడం లేదని పేషంట్లు వాపోతున్నారు. ఆస్పత్రిలో కాకుండా బయట నుంచి తెప్పించిన ఆహారాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. చెస్ట్‌ ఆస్పత్రిలో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యంపై ఓ రోగి బంధువు పంపిన వీడియో చూస్తే అర్థమవుతోంది.

Tags

Next Story