సామాజిక దూరం పాటించాల్సిందే: ఏపీ ప్రభుత్వం

సామాజిక దూరం పాటించాల్సిందే: ఏపీ ప్రభుత్వం

కరోనా వ్యాప్తిని నిరోదించాలంటే సామాజిక దూరం పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కరోనా పై తాజాగా బులెటిన్ విడుదల చేసిన ఏపీ సర్కార్.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 29,367మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చారని.. వీరిలో 29,172మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపింది. వ్యాధి వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరాన్ని పాటించాల్సిందేనని ప్రభుత్వం ప్రజలకి విజ్ఞప్తి చేసింది.

ఏపీలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు తేలటంతో మొత్తం 19 మందికి కరోనా ఉన్నట్టు తేలింది.

Tags

Next Story