భారత్ లో 1037 కు పెరిగిన కరోనా వైరస్ కేసులు

భారత్ లో 1037 కు పెరిగిన కరోనా వైరస్ కేసులు

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 1037 కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా గుజరాత్ లో ఇవాళ ఓ వ్యక్తి మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 25 కు చేరుకుంది. భారత్ లో కేసులు అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో వైరస్ మరింత విస్తరిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదయ్యాయి. కేరళలో 182 మందికి వైరస్ సోకింది.

మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 28 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ, కర్ణాటక కొనసాగుతున్నాయి. కర్ణాటకలో 82 , తెలంగాణాలో 67 , గుజరాత్ లో 45 , ఢిల్లీలో 39, ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story