రాష్ట్ర విపత్తు నిధి నుండి వలస కార్మికులకు సహాయం చేస్తాం : కేంద్ర హోమ్ శాఖ

21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అక్కడక్కడా చిక్కుకుపోయిన వలస కార్మికులతో సహా నిరాశ్రయులకు వసతి, ఆహారం, దుస్తులు, వైద్య సదుపాయాలు కల్పించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధుల కేటాయింపుల కింద వీరికి సహాయ శిబిరాల్లో ఆశ్రయం కల్పించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం ఈ రోజు ఒక లేఖ విడుదల చేసింది.
ఈ లేఖ గవర్నమెంట్ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ద్వారా విడుదల అయింది. అందులో లాక్డౌన్ కారణంగా చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులతో సహా నిరాశ్రయులకు తాత్కాలిక ఉపశమన చర్యలు.. తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, వైద్య సంరక్షణ మొదలైనవి అందించాలని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com