ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు
By - TV5 Telugu |28 March 2020 7:33 PM GMT
కరోనావైరస్ సోకిందన్న అనుమానంతో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్‌కి తరలించారు. ఇటీవల సదరు ఎమ్మెల్యే బావమరిది ఢిల్లీకి వెళ్లొచ్చారు.. దీంతో ఆయన.. ఆయన భార్యకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఇది తెలియక ఆయన ఇచ్చిన విందులో ఆ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. దీంతో ఆయనకు కూడా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో గుంటూరు సమీపంలోని ఓ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com