ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం.. 16 కు పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు 16 కు పెరిగాయి. శనివారం మూడు కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాబ్ పేటకు చెందిన భార్యాభర్తలకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వీరు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఇటీవల జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. కరోనా లక్షణాలతో దంపతులిద్దరూ ఒంగోలు ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరికి పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇద్దరిని ఒంగోలు రిమ్స్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే కర్నూల్ జిల్లాలోను తొలి కరోనా కేసు నమోదయింది. కర్నూలు జిల్లా నొస్సం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన తోపాటు ఉన్న మరో ముగ్గురిని గృహనిర్బంధంలో ఉంచారు వైద్యులు. అతని కరోనా సోకడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com