లాక్‌డౌన్: కేంద్రం కీలక ఆదేశాలు!

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 666,000 ను అధిగమించింది మరియు ఆదివారం నాటికి 30,900 కి పైగా కరోనావైరస్ సంబంధిత మరణాలు సంభవించాయి. భారతదేశంలో, ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులసంఖ్య1,000 మార్కును దాటింది, అలాగే భారత్ లో ఇప్పటివరకు 25 మంది మరణించారు. ఈ క్రమంలో కరోనాపై పోరుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది.
లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ సరిహద్దులో లాక్ అయిన వలస కార్మికులను ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు లాక్ డౌన్ లో ఉంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com