భారత్ లో వెయ్యికి చేరువగా కరోనా కేసులు
దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం వైరస్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువగా ఉంది. ప్రస్తుతం భారత్ లో 918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఇందులో 47 మంది విదేశీయులు ఉన్నారు. ఇందులో ఎక్కువశాతం విదేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 180 కరోనా కేసులు నమోదయ్యాయి. 173 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది.
కర్ణాటకలో 55, తెలంగాణలో 63, రాజస్తాన్‌లో 48, గుజరాత్‌లో 48, ఉత్తరప్రదేశ్‌లో 45, ఢిల్లీలో 39, పంజాబ్‌లో 38, హరియాణాలో 33, తమిళనాడులో 38, మధ్యప్రదేశ్‌లో 30, జమ్మూకశ్మీర్‌లో 18, పశ్చిమబెంగాల్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 16, లదాఖ్‌లో 13, బిహార్‌లో 9, చండీగఢ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, గోవాలో 3, పుదుచ్చేరిలో ఒకటి, మిజోరాంలో ఒకటి, మణిపూర్‌లో ఒకటి, అండమాన్ దీవుల్లో 2 కేసులు నమోదయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com