కరోనాపై పోరాటం: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

కరోనాపై పోరాటం: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

కరోనా వైరస్ కట్టడి కోసం బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ భారీ సాయం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. ‘ ఇది మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన సమయం. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

నా వంతుగా నేను దాచుకున్న మొత్తం నుంచి రూ. 25 కోట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నా. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్థిగా ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’ అంటూ అక్షయ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. కాగా అక్షయ్ కుమార్ ఇంత పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పలువురు ఆయనను మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story