వృద్ధురాలి మెడపై కరిచిన కరోనా క్వారంటైన్‌ వ్యక్తి

వృద్ధురాలి మెడపై కరిచిన కరోనా క్వారంటైన్‌ వ్యక్తి

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. క్వారైటైన్ లో ఉన్న ఓ వ్యక్తి వృద్ధురాలి మెడ కొరికి చంపాడు. తమిళనాడుకు చెందిన మణికందన్ (35) శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసేవాడు.. అయితే అతనికి ఈ వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. దాంతో ఈనెల తమిళనాడులోని తన స్వగ్రామానికి వచ్చాడు. కరోనా వైరస్ నేపథ్యంలో అతన్ని పరీక్షించి హోమ్ క్వారైటైన్ లో ఉంచారు. అయితే అతను అక్కడ ఉండలేక పారిపోయాడు.. ఈ క్రమంలో బయట కూర్చున్న 80 ఏళ్ళ వృద్ధురాలిపై దాడి చేసే ఆమె మెడ కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది.

దాంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికందన్ ను అరెస్ట్ చేశారు. గతంలోనే మణికందన్ కు మైండ్ సరిగా లేదని అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. 2010 లో మదురైలో మానసిక అనారోగ్య చికిత్స పొందాడని.. శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసి బాగా నష్టపోవడంతో తీవ్ర మనోవేదన చెంది ఇలా ప్రవర్తించి ఉండవచ్చని కుటుంబసభ్యులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story