లాక్‌డౌన్ విషయంలో ప్రజలను క్షమించమని కోరిన ప్రధాని మోదీ

లాక్‌డౌన్ విషయంలో తనని క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలని కోరారు. ఆదివారం జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని అన్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ప్రజలు తమని తాము రక్షించుకుంటూ.. తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్‌డౌన్ విధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలిగిస్తున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
మరికొన్ని రోజుల పాటు ‘లక్ష్మణ రేఖ’ దాటకుండా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చిన మోదీ.. వైరస్ కట్టడికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com