పోలీసులు రోడ్డుపై కట్టిన రోప్ వలన ఓ వ్యక్తి మరణం
By - TV5 Telugu |28 March 2020 7:32 PM GMT
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు పరోక్షంగా ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు. గోదావరి జిల్లాల వారధిగా ఉన్న రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై పలు ఆంక్షలు విధించి రాకపోకలు నిలిపివేశారు. అయితే బ్రిడ్జి మధ్యలో రోప్ కట్టారు. అయితే ఇది గుర్తించకుండా రోడ్‌పైకి వచ్చిన ఓ ల్యాబ్ టెక్నిషియన్ కిందపడి తల పగిలి చనిపోయాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com