ప్రధాని ఫోన్ కాల్ తో ఎగిరి గంతేసిన పుణే నర్సు

ప్రధాని ఫోన్ కాల్ తో ఎగిరి గంతేసిన పుణే నర్సు

పుణే నగరంలోని నాయుడు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఛాయ జగతాప్ అనే నర్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్యరీతిలో ఫోన్ కాల్ చేశారు. దాంతో ఆ నర్సు ఆనందంతో ఎగిరి గంతేశారు. నాయుడు ఆసుపత్రి నర్సు ఛాయా జగతాప్ కు ప్రధాని నేరుగా ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగారు. అంతేకాదు రోగులకు సేవ చేసే సమయంలో కుటుంబం గురించి ఏం ఆలోచిస్తారు అంటూ ప్రశ్నించారు. ప్రధాని ప్రశ్నలకు ఛాయ జగతాప్ బదులిచ్చారు..

కుటుంబం పట్ల కూడా ఆందోళన ఉండడం సహజమే అయినా, రోగులకు సేవ చేయడం తమ విధి అని, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో సేవలు అందించడం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పారు. ప్రధాని ఫోన్ కాల్ తో ఆమె సడన్ గా ఆనందంతో షాక్ అయ్యారు. కాసేపు అక్కడే ఉన్న తోటి సిబ్బందితో ఈ విషయాన్నీ ఆమె పంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story