మందు బాబులకు రిషి కపూర్ మద్దతు.. నెటిజన్లు ఫైర్

మందు బాబులకు రిషి కపూర్ మద్దతు.. నెటిజన్లు ఫైర్

కరోనా మహమ్మరి భారత్ లో విజృభిస్తుంది. దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఇక మందు బాబుల బాధ వర్ణనాతీతం. అయ్యో.. ముందుగా తెలిస్తే స్టాక్ పెట్టుకునే వాళ్లం కదా అని బాధపడే వాళ్లు లేకపోలేదు. అయితే తాజాగా మందు బాబులకు మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ చేసిన ట్వీట్ సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారంటే.. ‘ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుండి డబ్బులు అవసరం. అందుకోసం లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను కొంతకాలం సాయంత్ర వేళల్లో తెరిస్తే బావుంటుంది. తప్పుగా అర్థం చేసుకుని నన్ను తిట్టొద్దు. లాక్ డౌన్ సమయంలో మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో మద్యం అవసరం. కాబట్టి బ్లాక్‌లో అయినా మ‌ద్యం అమ్మే ఏర్పాటు చేయండి’ అని ట్వీట్ చేశారు రిషి కపూర్. ప్ర‌తిరోజూ సాయంత్రం లిక్క‌ర్ షాపులు తెర‌వాలంటూ ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరటంతో.. కొందరు నెటిజన్లు ఆయనపై ఆగ్రహంతో ట్వీట్ చేస్తున్నారు. అయితే రిషి కపూర్ ఇలాంటి కొత్తేమీ కాదు.. గతంలోనూ ఆయుధపూజ అంటూ బీర్ బాటిల్, ఓపెనర్ ఫోటో పోస్ట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

Tags

Next Story