కరోనా సాయం.. చైనా నుంచి జర్మనీకి బయలుదేరిన రైలు

కరోనాకు కేంద్ర బిందువైన చైనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దాదాపు రెండు నెలల పాటు హుబి ప్రావిన్స్ లోని వుహాన్ నగరం తోపాటు పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతో ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితికి నెలకొంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో రవాణా కూడా మొదలైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న చైనా.. ప్రస్తుతం దాని భారిన పడిన దేశాలకు సాయం చేస్తోంది. అందులో భాగంగా పలు దేశాలకు మందులు సరఫరా చేస్తోంది.
ఇటలీ, స్పెయిన్, జర్మనీ, యూకే దేశాలు వైరస్ కు విపరీతంగా దెబ్బతిన్నాయి.. దీంతో ఇక్కడ రోగులకు వైద్య సదుపాయాలు, మందులు అందకపోవడంతో మరణాల సంఖ్య కూడా పెరిగింది. దాంతో కోవిడ్-19 చికిత్సకు అవసరమైన 166.4 టన్నుల మందులను సాయంగా అందిస్తోంది. మందులతో ఉన్న సరకు రవాణా రైలు శనివారం వుహాన్ నుంచి జర్మనీలోని డూయిస్‌బర్గ్‌కు బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలు 15 రోజుల ప్రయాణం అనంతరం జర్మనీ చేరుకుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com