రెండేళ్ల చిన్నారితో సహా.. ఒకే కుటుంబంలో 25 మందికి..

రెండేళ్ల చిన్నారితో సహా.. ఒకే కుటుంబంలో 25 మందికి..
X

మహరాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు ఇటీవల సౌదీ నుంచి తిరిగి వచ్చారు. వారికి కరోనా వైరస్ సోకినట్లు మార్చి 23న నిర్ధారణ అయింది. వారి కుటుంబాలు నివసించే ఇళ్లన్నీ ఒకదానికొకటి ఆనుకుని ఉండడంతో కుటుంబంలోని 25 మందికి కరోనా సోకింది. అయితే ఈ నలుగురినీ కలిసిన బయటి వ్యక్తులకు కరోనా సోకకపోవడం విశేషం అని జిల్లా వైద్యాధికారి సీఎస్ సాలుంఖే తెలిపారు. కుటుంబంలోని వ్యక్తులు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడంతో వైరస్ సోకినట్లు తెలుసుకున్నారు. వైరస్ సోకిన వారందరినీ క్వారంటైన్లో ఉంచారు. ముందు జాగ్రత్త చర్యగా వారు నివస్తున్న ఇంటి నుంచి ఒక కి.మీ దూరం వరకు కంటోన్మెంట్ జోన్‌గా కలెక్టర్ ప్రకటించారు. కరోనా వచ్చిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు పాత్రల మీద పడితే కూడా వైరస్ మరొకరికి అంటుకుంటుందని సాలుంఖే తెలిపారు. వారిని కలిసిన వ్యక్తులకు టెస్టుల్లో నెగటివ్ అని తేలినా వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.

Tags

Next Story