ప్రకాశం జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు..

ప్రకాశం జిల్లాలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిసస్తోంది. చీరాల మండలం నవాబుపేటకు చెందిన భార్యాభర్తలకు కరోనా నిర్ధారణ కావడంతో జిల్లా వ్యాప్తంగా భయాందోళన నెలకొంది. నవాబు పేటప్రాంతాన్ని క్వారంటైన్ జోన్ గా ప్రకటించి నష్టనివారణ చర్యలు చేపట్టారు అధికారులు. మరోవైపు నిన్న ఆదివారం కావడంతో చికెన్ సెంటర్లకు జనం భారీగా క్యూ కట్టారు. ఏ మాత్రం కూడా సామాజిక దూరం పాటించకుండా షాపుల ముందు బారులు తీరడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.

కేజీ చికెన్ ధర మొన్నటివరకు రూ. 150 ఉంటే ఆదివారం ఒక్కసారిగా అది రూ. 200 లు అయింది. అంతేకాదు కొన్ని చోట్ల అయితే ఇంకా ఎక్కువ రేటుకు విక్రయించారు. ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే 1000 గ్రాములు రావాల్సిన కేజీ చికెన్ 800 , 900 గ్రాములు మాత్రమే వస్తోంది. దీంతో వినియోగదారుల చెబులకు చిల్లులు పడ్డాయి. ఇక రేషన్ దుకాణాల దగ్గర జాతరను తలపించింది. రేషన్ బియ్యం తీసుకోవడానికి జనం పెద్దసంఖ్యలో గుమిగూడారు.

Tags

Next Story